Two Ships Sink: సముద్రంలో మునిగిన రెండు నౌకలు.. 11 మంది మృతి.. 64 మంది గల్లంతు

by Indraja |   ( Updated:2024-06-18 04:12:33.0  )
Two Ships Sink: సముద్రంలో మునిగిన రెండు నౌకలు.. 11 మంది మృతి.. 64 మంది గల్లంతు
X

దిశ వెబ్ డెస్క్: సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 64 మంది గల్లంతైయ్యారు. ఈ ఘటన ఇటలీ దక్షిణ తీరంలో చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు తెలిపిన సమాచారం ప్రకారం.. నిన్న ఇటలీ దక్షిణ తీరంలో ప్రయాణికులతో చెక్క పడవ ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఆ పడవ సముద్రంలోని రాళ్లమధ్య చిక్కుంది. ఈ క్రమంలో పడవలోకి నీరు చేరడంతో పడవ మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇటాలియన్ మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ వెంటనే సమీపంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలను రెస్క్యూ ఆపరేషన్‌కు మళ్లించింది.

దీనితో నాదిర్ అనే వాణిజ్య పడవలోని సిబ్బంది వెంటనే స్పందించింది. హుటాహుటీనా మునిగిన పడవలో లైఫ్ జాకెట్స్ దరించిన 51 మందిని రక్షించింది. కాగా వీరిలో ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. అలానే పడవ దిగువ డెక్‌‌లో ఉన్న 10 మంది మృతి చెందారు. కాగా వారి మృతదేహాలను సైతం ఒడ్డుకు తరలించారు. కాగా పది రోజుల వ్యవదిలో ఇది రెండోసారి. కాలాబ్రియా నుండి 200 కిలోమీటర్ల దూరంలో మొదటి ఓడ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజుల క్రితం టర్కీ నుంచి మేడే అనే ఫ్రెంచ్ బోట్‌ బయలుదేరింది.

కాగా బోట్‌ గ్రీస్ మరియు ఇటలీ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సరిహద్దు ప్రాంతానికి చేరుకోగానే పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనితో పడవ బోల్తాపడింది. దీనితో అప్రమత్తమైన పడవ సిబ్భంది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలాని చేరుకుని పడవలోని కొంతమందిని రక్షించారు. కాగా మరికొందరు ప్రయానికులు గల్లంతైయ్యారు. కాగా రెండు పడవ ప్రమాధాల్లో కలిపి మొత్తం 64 మంది గల్లంతైయ్యారని సమాచారం. కాగా గల్లంతైన వారితోపాటుగా సముద్రంలో ప్రాణాలతో బయటపడినవారు ఇరాన్, సిరియా, ఇరాక్ నుండి వచ్చినట్లు U.N ఏజెన్సీలు తెలిపాయి. కాగా రక్షించిన వారిని రోసెల్లా జోనికాలోని కాలాబ్రియన్ నౌకాశ్రయానికి తీసుకువచ్చి, వారి సంరక్షణ చూసుకోవాల్సిందిగా వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed