ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 10.1 శాతం : ప్రపంచ బ్యాంకు

by Harish |
ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 10.1 శాతం : ప్రపంచ బ్యాంకు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 10.1 శాతంగా అంచనా వేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన 5.4 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రత్యక్ష రంగంలో కార్యకలాపాలు మెరుగ్గా ఉండటం, కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, దేశీయంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతంగా కొనసాగుతుండటం ఈ వృద్ధికి దోహదపడుతుందంది.

ఈ ధోరణి దేశీయ డిమాండ్‌ను పునరుద్ధరిస్తుందని బుధవారం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన దక్షిణ ఆసియా ఆర్థిక నివేదికలో తెలిపింది. గతేడాది జులై-డిసెంబర్ మధ్య రికవరీ వేగవంతం కావడంతో పాటు ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు పుంజుకోవడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి దేశ జీడీపీ -9.6 శాతం నుంచి 8.5 శాతం సానుకూల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story