- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం: విద్యుత్‌లైన్ సరిచేయడానికి వెళ్లి కార్మికుడు మృతి..
దిశ, పరకాల : చెరువులో ఉన్న విద్యుత్తు ఫోల్ పై విద్యుత్ వైర్లను సరిచేయడానికి చెరువులో ఈత కొడుతూ వెళుతున్న క్రమంలో దేవు రవీందర్ రెడ్డి అనే విద్యుత్ కార్మికుడు చెరువులో మునిగి చనిపోయిన ఘటన నడికూడ మండలం రామకృష్ణాపురంలో జరిగింది. సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దేవు రవీందర్ రెడ్డి(40) నడికూడ సబ్ స్టేషన్ లో ఆన్ మ్యాన్ వర్కర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు రవీందర్ మరో విద్యుత్ కార్మికుడితో కలిసి విధులు వెళ్లాడు.
రామకృష్ణాపురం గ్రామంలోని మమ్మసారికుంట చెరువులో గల లెవెన్ కెవి విద్యుత్ పోల్ పై విద్యుత్ తీగలు వరుస తప్పిపోయాయి. వాటిని సరిచేయడానికి చెరువులో ఉన్న పోల్ వద్దకు వెళ్లేందుకు చెరువులో ఈత కొడుతూ వెళుతున్న క్రమంలో రవీందర్ చెరువులో గల్లంతై పోయాడు. సుమారు మూడు గంటలకుపైగా రవీందర్ ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీంతో వెతికించగా చెరువులో రవీందర్ రెడ్డి మృతదేహం లభించింది. ఈ ఘటనతో రామకృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై పోలీసుల వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలియజేశారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.