మహిళల టీ20 చాలెంజ్ స్పాన్సర్ జియో

by Shyam |   ( Updated:2020-11-01 08:55:19.0  )
మహిళల టీ20 చాలెంజ్ స్పాన్సర్ జియో
X

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మహిళల టీ20 చాలెంజ్ టైటిల్ స్పాన్సర్‌గా జియో వ్యవహరించనున్నట్టు ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. ప్రత్యేకంగా మహిళల మ్యాచ్‌ల కోసం బీసీసీఐ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. ‘అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మహిళల క్రికెట్ కూడా ప్రాధాన్యం ఉంది. జియో మహిళల టీ20 చాలెంజ్ మరికొంత మంది యువతులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రేరిపిస్తుంది. తమ కుమార్తెలు క్రికెట్ ఆడటం గొప్ప కెరీర్ అవకాశంగా తల్లిదండ్రులకు విశ్వాసం కల్పిస్తుందని ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 4 నుంచి 9 వరకు షార్జాలో జియో మహిళల టీ20 చాలెంజ్ జరగనున్నది. మొత్తం మూడు జట్లు తలపడనున్నాయి. వెలోసిటికి మిథాలీరాజ్, ట్రైలేబ్లజర్స్‌కు స్మృతి మందాన, సూపర్ నోవస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్నారు. గత ఏడాది ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సూపర్ నోవస్, వెలోసిటీ జట్లు ఈ నెల 4న 7.30 గంటలకు తొలి మ్యాచ్ ఆడనున్నాయి.

Advertisement

Next Story