- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రులకు షాకిచ్చిన ఒంటరి మహిళలు..
దిశ, జవహర్ నగర్: తెలంగాణ మంత్రులు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినా స్థానికులు షాక్ ఇస్తున్నారు. తాజాగా జవహర్ నగర్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ పరిధిలోని సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ లు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించగా కొందరు ఒంటరి మహిళలు తమకు పింఛన్లు నేటికీ అందలేదని నిరసన తెలిపారు.
ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని పెద్ద ఎత్తున స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో వాగ్వివాదానికి దిగారు. మంత్రి మల్లారెడ్డి ప్రసంగానికి మహిళలు అడ్డుతగిలారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదంతా చూసి అక్కడున్న అధికార పార్టీనేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చివరగా స్థానిక కార్పొరేటర్లు వారికి సర్ది చెప్పి, పింఛన్ మంజూరు చేయిస్తామని భరోసా కల్పించడంతో వారు సైలెంట్ అయ్యారు.దీంతో మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు.