- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల ఆందోళన.. మూతపడ్డ మద్యం దుకాణాలు
ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజుల సుదీర్ఘ విరామం తరువాత ఈరోజు మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం దుకాణాలకు మందుబాబులు పోటెత్తారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల మద్యం కొనుగోలు చేసిన వెంటేనే పూటుగా తాగేయడంతో పలువురు అదుపుతప్పారు. దీంతో వైన్ షాపులను తెరవద్దంటూ చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. నివాసాల మధ్యలో ఉన్న వైన్ షాపులను మూసేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. వైన్ షాపులను మూసేయాల్సిందేనని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల జోక్యంతో మూడు మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు సత్యవేడులో కూడా మహిళలు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఆందోళన చేపట్టారు. పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. దీంతో అక్కడ దుకాణాలు కూడా మూయించారు.
tags: chittoor district, tirupati, papanaidupet, satyavedu, liquor shops closed, ladies protest