- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హియరింగ్ లాస్ చిన్నారులకు షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ అవేర్‌నెస్
దిశ, ఫీచర్స్ : అవకాశాలు తలుపు తట్టేవరకు వెయిట్ చేస్తూ కూర్చుంటే విలువైన సమయం వృథా అవుతుంది. అలాకాకుండా అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు వెళ్తేనే మనుగడ సాగించడంతో పాటు సమాజంలో గుర్తింపు పొందగలం. పదిమంది నడిచే కొత్తబాటకు నాంది పలకగలం. పాలస్తీనా మహిళలు అదే చేసి చూపిస్తున్నారు. వినికిడి లోపమున్న పాలస్తీనా మహిళల బృందం.. ఈ లోపమున్న పిల్లలకు తమ పరిస్థితి వివరిస్తూ, వారికి తమ కెరీర్‌పై అవగాహన కల్పించేలా స్టాప్ మోషన్ యానిమేషన్ ఉపయోగించుకుని ‘యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్’ రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
కరోనా తర్వాతే కాదు, కరోనా ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా ‘నిరుద్యోగం’ ఓ పెద్ద సమస్యగా ఉంది. పెద్ద చదువులు చదివినా ఉద్యోగావకాశాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఏ పని చేసేందుకైనా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హియరింగ్ లాస్’ ఉన్న మహిళల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పరిమితమైన కెరీర్ ఆప్షన్స్ ఉండటంతో వారు ‘షార్ట్ ఫిల్మ్స్’ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రెండు యానిమేటెడ్ షార్ట్స్ ఫిల్మ్స్ తీశారు.
తొలి సినిమా ‘సైన్ లాంగ్వేజ్’ నేపథ్యంలో తీయగా, రెండో చిత్రాన్ని 49 శాతం నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న గాజాలో పనిచేసే హక్కును సమర్థిస్తూ తెరకెక్కించారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులు, మహిళలు తమ లక్ష్యాన్ని చేధించే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు దాటుకుని, చరిత్ర సృష్టించేలా ప్రేరేపించే కథలనే తాము తెరకెక్కిస్తామంటున్న ఈ మహిళల బృందం.. వారిని ఇన్‌స్పైర్ చేయడమే తమ బాధ్యత అని, తమ చిత్రాల ద్వారా వారికి కెరీర్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఈ మహిళలు పాత్రలను డిజైన్ చేయడంతో పాటు లఘుచిత్రానికి అవసరమైన చిత్రాలను కాగితంపై గీస్తారు. స్టాప్ మోషన్ అప్లికేషన్ ఉపయోగించి వారి సెల్‌ఫోన్ కెమెరాలతో సినిమాను షూట్ చేసి, తమ టీమ్ మెంబర్స్ సాయంతో వాటిని సైన్ లాంగ్వేజ్‌లో వివరిస్తారు. 27 ఏళ్ల హిబా అబూ జాజర్‌కు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. తన ఇష్టాన్ని వృత్తిగా చేసుకుని, షార్ట్స్ ఫిల్మ్స్ తీయడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది.
నేను సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నాను. సినిమాలు చేస్తూ నా కాళ్లమీద నిలబడాలనుకుంటున్నాను. వినికిడి వైకల్యం ఉన్నవారికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా లేవు. గాజా హేమం యూత్ సెంటర్(సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్) మాకు అందిస్తున్న సాయం గొప్పది. మాలోని కళ, సృజనాత్మకతతో పాటు మా ఆశయాలను కొనసాగించేలా మమ్మల్ని ప్రొత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.
– అబూ జాజర్, షార్ట్ ఫిల్మ్ మేకర్, కార్టూనిస్ట్