గెల్లు శ్రీనివాస్ కు సభలో షాక్ ఇచ్చిన మహిళలు.. అసలేం జరిగిందంటే ?

by Sridhar Babu |   ( Updated:2023-12-17 14:59:51.0  )
harish
X

దిశ ప్రతినిది, కరీంనగర్: మట్టి నుండి పుట్టిన బిడ్డను నేను నన్ను ఆశీర్వదించండి అంటూ గెల్లు శ్రీనివాస్ స్పీచ్ ఇస్తున్నారు. అంతే సభా వేదిక ముందు కూర్చున్న మహిళలు చకాచకా లేచి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అప్పటికే మద్యాహ్నం దాటిపోవడంతో సభకు హాజరైన మహిళలు గెల్లు ఉపన్యాసం వినకుండానే వెళ్లిపోయారు. మంత్రి హరీష్ రావు స్పీచ్ ఇచ్చినంత సేపు ప్రశాంతంగా విన్న మహిళలు గెల్లు మైకు అందుకున్న వెంటనే వెళ్లిపోతుండడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్ళాయి.

Advertisement

Next Story