- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేగంపేటలో వివాహిత అనుమానాస్పద మృతి
దిశ, క్రైమ్ బ్యూరో: బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు వివరాల ప్రకారం… స్థానిక ఎయిర్ ఫోర్స్ కాలనీలో ‘మన భూమి సుముఖ’ అపార్టుమెంట్‌లో నేపాల్‌కు చెందిన సాగర్ రేవత్ వాచ్‌మాన్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఐదేండ్ల క్రితం నిర్మల(21)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సాగర్ కూరగాయల కోసం బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య గదిలోని సీలింగ్ హుక్‌కు చున్నీతో ఉరేసుకుని శవమై కనిపించారు. ఈ విషయాన్ని సాగర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న ఆమె మేనమామకు అప్పగించారు. సాగర్ కూరగాయలకు వెళ్ళిన తర్వాత నిర్మల ఒకసారి ఫోన్ మాట్లాడుతూ… గది నుంచి బయటకు వచ్చినట్టుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. కానీ నిమిషాల వ్యవధిలో మృతదేహమై కనిపించడం పోలీసులకు అంతుచిక్కడం లేదు. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.