తన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడని..

by Aamani |
తన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడని..
X

దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. తన ఫొటోలను అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ముధోల్‌ మండల కేంద్రలో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన అసభ్యకర ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితునిపై నిర్భయ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story