- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి అండగా మహిళా సమాఖ్య సంఘాలు
దిశ, మెదక్: కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తాము సైతం అంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘాల మహిళలు ముందుకొచ్చారు. చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాలకు చెందిన మహిళా ప్రతినిధులు మంత్రి హరీశ్ రావుకు రూ.10వేలు సీఎంఆర్ఎఫ్ నిధి కోసం అందజేశారు. బుధవారం సిద్ధిపేటలోని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, ఇబ్రహీంనగర్, గోనేపల్లి గ్రామాల్లోమధ్యాహ్నం మంత్రి పర్యటించి, ఆయా గ్రామాల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావుమాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఐదున్నర కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయన్నారు. మిగతా బ్యాగుల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ మాట్లాడారని బ్యాగులు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతులు కూడా గతంలోని పాత గన్నీ బ్యాగులు ఉంటే తీసుకురావాలని కోరారు. ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు వచ్చే అవకాశం ఉందని, రైతులు టార్ఫలిన్ కవర్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. టార్ఫలిన్ కవర్లు లేకపోతే రైతులు ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు.
ప్రతీ పల్లెల్లోనూ కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసి, మీ వద్దకే వచ్చి ధాన్యం కొంటామని మరోసారి స్పష్టం చేశారు. కావున రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, పంట కోసిన తరువాత బాగా ఆరబెట్టిన అనంతరం మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకు రావాలని రైతులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో మన దేశంలో కరోనా వైరస్ అదుపులో ఉందన్నారు. ప్రస్తుతం దానికి మందు లేదని, అందుకే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మంత్రితో చిన్నకోడూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Tags: minister harish rao, corona, lockdown, rs.10000 funding, cmrf