- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
దిశ, శేరిలింగంపల్లి: మహిళలు అన్నిరంగాల్లో ప్రతిభ కనబరిచి పురోగతి సాధించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు భాగ్యనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమెన్ ఫర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి రాశీఖన్నా, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ లావణ్య, మొదటి కమర్షియల్ పైలెట్ అజ్మీర్ బాబీ హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ముగింపు కార్యక్రమానికి హాజరైన డీకే అరుణ, కపిల్ మిశ్రా, ఎమ్మెల్సీ రామచంద్రారావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీకే.అరుణ మాట్లాడుతూ.. నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లింగ సమానత్వం కనిపించడం లేదన్నారు.
అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా భాగ్యనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఫౌండేషన్ గౌరవ సలహాదారు గంగల రాధాకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.