షాపునకు వచ్చిన మహిళపై అత్యాచారం

by srinivas |   ( Updated:2020-10-14 02:09:06.0  )
షాపునకు వచ్చిన మహిళపై అత్యాచారం
X

దిశ, వెబ్‎డెస్క్: కిరాణా షాపుకు వచ్చిన మహిళను నిర్భంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు మండలం పొడుపాడులో శాంతిరాజా అనే వ్యక్తి.. కిరాణా షాపుకు వచ్చిన ఓ మహిళను నిర్భంధించి అత్యాచారం చేశాడు. శాంతిరాజా ఇంట్లో నిర్భంధించిన మహిళను గుర్తించారు బంధువులు. అనంతరం గ్రామస్తులు బాధితురాలిని జీజీహెచ్‎కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed