మహిళపై సామూహిక అత్యాచారం

by Sumithra |   ( Updated:2020-07-31 12:15:40.0  )
మహిళపై సామూహిక అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దుశ్చర్యను వీడియో తీయడమే కాక, సోష‌ల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. బీహార్‌లోని మధుబనిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి.. వీడియోలో క‌నిపించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

స్థానిక మధుబని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు అదే ప్రాంతంలో నివసిస్తున్న భర్త వదిలేసిన ఓ మహిళపై అత్యాచారం చేశారు. ముందుగా వీరిలో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు. దీంతో ఆమె అతడి ప్రేమకు సరే అన్నది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈక్రమంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే అప్పటికే తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు. చివరకు పోలీసులకు విషయం తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed