టెన్షన్..టెన్షన్.. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదం.. డేరింగ్‌‌తో మహిళలు ఏం చేశారంటే..

by Shyam |
టెన్షన్..టెన్షన్.. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదం.. డేరింగ్‌‌తో మహిళలు ఏం చేశారంటే..
X

దిశ, కామారెడ్డి : మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలంలోని రాజ్ ఖాన్ పేట అటవీ ప్రాంతంలో స్థానికులు ట్రాక్టర్లతో అటవీ భూములను దున్నుతున్నారని ఆరోపిస్తూ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ అధికారులు వెళ్లారు.

ఘటనా స్థలానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులతో గ్రామస్తులు గొడవకు దిగారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని పలువురు గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో అధికారులను హెచ్చరించారు. సుమారు రెండు గంటల పాటు అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్లను సీజ్ చేయడానికి ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్న మహిళలు ట్రాక్టర్లకు అడ్డుగా కూర్చున్నారు.

ఈ క్రమంలో వారిని ట్రాక్టర్ల ముందునుంచి లాగడానికి అధికారులు ప్రయత్నించగా గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. పురుగుల మందు డబ్బాలను చేతిలో పట్టుకొని ట్రాక్టర్లను సీజ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు.

Advertisement

Next Story