- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు ముందుగా కోరేది వాళ్లే!
త్వరగా చదువులు పూర్తి చేసి, ఎవరో ఒకర్ని త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలో మహిళలు ముందుంటారని సంప్రదాయవాదులు మన మెదళ్లలో ఒక అభిప్రాయాన్ని సృష్టించారు. అయితే ఈ రోజుల్లో అది మారింది. వాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లి అంటే విముఖత చూపిస్తున్నారు. కానీ విడాకుల విషయంలో ముందుంటారని అమెరికా సోషియోలాజికల్ అసోసియేషన్ పరిశోధనలో తేలింది. ఎందుకో తెలుసుకోండి.
1. పెళ్లి వల్లే వెనకపడుతున్నామనే భావన
ఈరోజుల్లో దాదాపు ప్రతి గృహిణి ఏదో ఒక రకమైన ఉద్యోగం చేసి కుటుంబ పోషణలో భాగం కావాలనుకుంటోంది. అందులో భాగంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ కెరీర్‌లో మెరిసిపోతున్న వాళ్లు కూడా ఉన్నారు. అందులో భాగంగా వారికి వృత్తిపరంగా ఎదిగే అవకాశం వస్తే కుటుంబం కారణంగా వదులుకోవాల్సి వస్తోంది. కాబట్టి ఈ కారణంగా విడాకులు తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.
2. భావోద్వేగాల సమన్వయంలో తేడా
దంపతుల్లో ఎక్కువ భావోద్వేగాలు సమన్వయం చేయగల శక్తి మహిళకే ఉంటుంది. మగవాళ్లు ఎదుగుతున్నపుడు భావోద్వేగాలను ఎలా తట్టుకోవాలో నేర్చుకోరు. కాబట్టి తమకు ఎమోషనల్ సపోర్టు అవసరమైనపుడు మహిళల మీద ఆధారపడతారు. కానీ, మహిళ విషయంలో ఇలాంటి సదుపాయం ఉండదు. తన భర్త భావోద్వేగాలను, తన భావోద్వేగాలను తానే సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. విడాకులు ముందు అడగడానికి ఇది మరో కారణం.
3. ఇక తట్టుకోవటాల్లేవ్…
ఒకప్పుడు భర్త తాగొచ్చి కొట్టినా, తిట్టినా భార్యలు పడేవారు. కానీ ఇప్పుడు లింగసమానత్వం, మారిటల్ రేప్ వంటి అంశాలు బలంగా నాటుకుంటున్న నేపథ్యంలో భర్త చిన్న మాట అన్నా కూడా వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న ఆత్మవిశ్వాసం వల్ల వారు ఆత్మగౌరవానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో విడాకులు కోరడానికి ముందుకొస్తున్నారు.