మహిళల పై పోలీసుల దాడులు మితిమీరి పోతున్నాయ్

by Shyam |
tdp
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పోలీసుల దాడులు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, ఖమ్మం జిల్లాలో గిరిజన మహిళలపై వారం రోజులుగా జరుగుతున్న దాడులు చూస్తుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని తెలుస్తుందన్నారు.

మహిళలపై పోలీసుల దాష్టినీకం కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనపడం లేదా అని ఆమె ప్రశ్నించారు. అంతే కాకుండా ఫారెస్టు అధికారులకు, పోడు రైతులకు ఘర్షణ జరగకుండా ఉండేలా పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి యేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరీఫ్, మెదక్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఇల్లెందుల రమేష్, తెలుగు రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story