- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కష్టాన్ని పొగొట్టిన వర్షం.. బాధ మరిచి చిందేసిన ఫారెస్ట్ ఆఫీసర్@ నెట్టింట వైరల్!
దిశ, వెబ్‌డెస్క్ : ఒడిశాలో ఓ మహిళా అటవీ అధికారి వర్షంలో డాన్స్ చేస్తున్న వీడియా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వులో నెల రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, మంటలు అదుపులోకి రాలేదు. సరిగ్గా అదే సమయంలో వరుణుడు తేలికపాటి జల్లులు కురిపించడంతో విధుల్లో ఉన్న ‘స్నేహ ధల్’ అనే అధికారిణి ఆనందంతో మైమరిచి పోయి పెద్దగా అరుస్తూ డాన్స్ చేసింది. చిరు జల్లులు కురుస్తున్న సమయంలో ఆమె ఆనందంగా గ్రోయింగ్ చేస్తున్న వీడియోను ‘కిషోర్ మొహంత’ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తక్కువ వ్యవధిలోనే ఆ వీడియోను 1.76 వేల మంది వీక్షించడంతో పాటు అటవీని కాపాడుకున్నామనే సంతోషంలో నాట్యం చేస్తున్న స్నేహ ధల్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పర్యావరణం, డ్యూటీ పట్ల ఆమె నిజమైన అంకితభావాన్ని కనబరించిందని కామెంట్లు చేస్తున్నారు.
The real empowered Nature Lover Forester Mrs. Sneha Dhal who has been involved in dousing the fire in Similipal 24×7 and finally happy with grace of God " The Rain"@PMOIndia @CMO_Odisha @TheGreatAshB @dpradhanbjp @DM_Mayurbhanj @BasudevNews pic.twitter.com/s4WCO62XgW
— Dr. Yugal Kishore Mohanta (@ykmohanta) March 10, 2021
అయితే, గత కొన్ని రోజులుగా అగ్నికిలలకు ఆహుతవుతున్న వృక్ష సంపదను కాపాడుకునే క్రమంలో విఫలమైన తమకు దేవుడు వర్షం రూపంలో సాయం చేశాడని, దీంతో అటవీని సంరక్షించుకున్నామని ఆ అధికారిణి పెద్దగా అరుస్తూ చిందేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. 23 సెకన్ల వ్యవధి గల వీడియోలో యువ అధికారి ఉత్సాహం, ఆనందాన్ని కనబరిచింది. స్నేహ ధల్ ఎగరడం, పరిగెత్తడం ముఖ్యంగా ఆమె ‘ప్రకాశవంతమైన చిరునవ్వు’ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
-