- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెంగ్యూతో మహిళ మృతి
X
దిశ, ముల్కలపల్లి: మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో గంటా అలివేలు (50) జ్వరంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నాలుగు రోజుల నుంచి అలివేలు తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. స్థానికంగా వైద్యం చేపిస్తోంది. రక్త పరీక్ష చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో సాధారణ వైద్యం చేయించుకుంటోంది. జ్వరం తీవ్రత ఎక్కువ కావడం గమనించిన కుటుంబ సభ్యులు సోమవారం పాల్వంచలో ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. ఖమ్మంలో రెండు మూడు ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Next Story