మేడారంలో మహిళ ప్రసవం..

by Shyam |
మేడారంలో మహిళ ప్రసవం..
X

మేడారంలో మహరాష్ట్రకు చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించగా గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో సంతానం కలిగినందున తన కొడుక్కు జంపన్న అని నామకరణం
చేసింది.

కాగా, ఆమెది మహారాష్ట్రలోని పూణే జిల్లా, చెన్న గ్రామానికి చెందినది. మహిళ పేరు సిహెచ్.శివాని. పురిటి నొప్పులతో వచ్చిన ఆమెకు వైద్యులు వెంటనే స్పందించి సాధారణ కాన్పు చేశారని, మగ బిడ్డ జన్మించడంతో తనకు సంతోషంగా ఉందని శివాని తెలిపారు.

Advertisement

Next Story