UAEలో అడుగుపెట్టిన మహిళా క్రికెటర్లు..

by Shyam |   ( Updated:2020-10-22 07:50:21.0  )
UAEలో అడుగుపెట్టిన మహిళా క్రికెటర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత మహిళా జట్టు ప్లేయర్లు UAE చేరుకున్నారు. త్వరలో జరగనున్న T20 టోర్నీలో పాల్గొనేందుకు ముందస్తుగా గురువారం యూఏఈలో అడుగుపెట్టారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అనంతరం బయోబబుల్‌లో అడుగుపెడుతారు.

అయితే, సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడే ఈ లీగ్ నవంబర్ -4 నుంచి 9వరకు జరగనుంది. భారత్ నుంచి మిథాలీరాజ్, జులన్ గోస్వామి, హర్మన్ ప్రీత్, స్మృతి మందాన వంటి స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో అలరించనున్నారు.

Advertisement

Next Story