మధ్యప్రదేశ్ హోం మంత్రిగా మహిళా కానిస్టేబుల్

by Shamantha N |   ( Updated:2021-03-08 08:02:59.0  )
Women Constable
X

భోపాల్: ఆమె ఒక సాధారణ కానిస్టేబుల్. పని చేసేది హోంమంత్రి కార్యాలయంలో. ఎప్పటిలాగే సోమవారం కూడా డ్యూటీకి వచ్చింది. అనుకోకుండా ఆమెకు ఆఫీసునుంచి పిలుపు. ఏం పనిమీద పిలిచారో అని లోపలికి వెళ్లి చూస్తే.. స్వయంగా హోంమంత్రే ఆమెను తన చెయిర్‌లో కూర్చోబెట్టాడు. చుట్టుపక్కనున్నవాళ్లు కరతాళ ధ్వనుల మధ్య ఆమె మధ్యప్రదేశ్ హోంమంత్రి సీటులో ఆసీనురాలైంది. కానీ ఇదంతా ఆమెకు కలలా అనిపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ దృశ్యం మధ్యప్రదేశ్‌లో సాక్షాత్కారమైంది. భోపాల్‌లోని హోంమినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఆఫీసు ఇందుకు వేదికైంది. అక్కడ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మీనాక్షి వర్మ ఒక్కరోజు హోంమంత్రిగా విధులు నిర్వర్తించింది. ఆమె హోంమంత్రిగా విధులు చేస్తున్న సమయంలో ఉపముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే అసిస్టెంట్ డీజీపీ అశోక్ అక్కడకు వచ్చి మీనాక్షిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. మీనాక్షి బాస్ అశోకే కావడం గమనార్హం.

Advertisement

Next Story