- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమెన్స్ డే స్పెషల్: ఫి‘మేల్ కొలుపు’ చిత్రాలు
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీలో, జీవనరీతిలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. కానీ మహిళలకు ప్రాధ్యాన్యతనిచ్చే విషయంలో మాత్రం చెప్పుకోదగ్గ చేంజ్ కనిపించడం లేదు. చిత్రపరిశ్రమ అందుకు మినహాయింపేం కాదు. ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులేస్తుండగా.. భారతీయ మహిళల లైఫ్ స్ట్రగుల్స్, ఒత్తిళ్లు, వాస్తవికతను అందించే చిత్రాలు కొన్నింటినైనా చూడగలుగుతున్నాం. ఈ కోవకు చెందనవే ‘థప్పడ్, తమారీ సులు, పంగా, గ్రేట్ ఇండియన్ కిచెన్’ చిత్రాలు. ఇక అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో వచ్చిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ అనే షార్ట్ ఫిల్మ్.. ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న వర్చువల్ డేటింగ్ విషయాన్ని చర్చించడంతో పాట పురుషులకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుందా? అనే ప్రశ్నను లేవనెత్తెంది. ఇదేకాదు ఇటీవలి కాలంలో స్త్రీ భావాలను అద్భుతంగా ఆవిష్కరించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్.. మహిళా హృదయాలను దోచుకుని, పురుషాధిక్య సమాజాన్ని ప్రశ్నించాయి. నేటి మహిళా దినోత్సవ వేళ ఆ చిత్ర విశేషాలు మీకోసం.
దేవి..
ప్రియాంక బెనర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లైంగిక హింసకు గురైన మహిళల ఇతివృత్తంగా సాగుతుంది. బలమైన పాత్రలతో, మరింత బలమైన కథాంశంతో మహిళలపై దేశంలో జరుగుతున్న ‘సెక్సువల్ వయొలెన్స్’ను తెరమీదకు తెచ్చిన ఈ లఘుచిత్రంలో కాజోల్, నేహా దూపియా, శ్రుతి హాసన్ నటించారు. వివిధ సామాజిక నేపథ్యాలకు చెందిన తొమ్మిదిమంది ఒకే గదిలో ఉంటారు. ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, భయంకరమైన వారి గత పరిస్థితుల నేపథ్యంలో ఐక్యంగా ఉంటారు. వీరిలో ప్రతీ ఒక్కరి కథ మన హృదయాన్ని బరువెక్కిస్తుంది. మహిళలు లైంగికంగా ఎంతగా వేదనకు గురవుతున్నారో కళ్లకు కట్టిన ఈ చిత్రం చివరి వరకు థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో మనల్ని కట్టిపడేస్తుంది.
ఘర్ కీ ముర్గీ..
‘మన ఇంటికోడి పప్పుతో సమానం (ఘర్ కీ ముర్గీ, దాల్ బరాబార్)’ అనే ఊరికే అనలేదు. మన ఇంట్లో వ్యక్తి ఎంతటి ఘనుడైనా, ఎన్ని గొప్ప పనులు చేస్తున్నా మన కంటికి మాత్రం అవేవీ కనిపించవు. ప్రధానంగా మన ఇంట్లోని మహిళల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంటుంది. ఇదే కథను బేస్ చేసుకుని వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘ఘర్ కీ ముర్గీ’. సెలవన్నదే లేకుండా, అలుపన్నదే రాకుండా, ఆరోగ్యం బాగా లేకపోయినా సరే గృహిణులు కుటుంబం కోసం ఎంతగా కష్టపడుతున్నా, అదంతా సాధారణ విధిగానే పరిగణిస్తారు. ప్రతీ ఇంట్లో జరిగే ఈ తంతునే ఈ లఘు చిత్రంలో అద్భుతంగా చూపించారు. సాక్షి తన్వర్ ప్రధాన పాత్రలో నటించగా, అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించాడు.
పిన్ని..
ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్ అందించిన ‘జిందగీ ఇన్ షార్ట్’ ఆంథాలజీలో ‘పిన్ని’ ఓ షార్ట్ ఫిల్మ్. తాహిరా కశ్యప్ డైరెక్ట్ చేయడంతో పాటు కథ కూడా అందించింది. నీనా గుప్తా లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం వృద్ధాప్యానికి చేరవవుతున్న ఓ సగటు మహిళ కథను మనకు అందిస్తుంది. ఆ ఉత్తమ ఇల్లాలుకు తన భర్త కేటాయించే సమయం చాలా తక్కువ. ఇక పిల్లలు, బంధువులు తమకు అవసరమైన పనులు, ఆహారం కోసం పిలవడం తప్ప ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేది అరుదు. ఆమెకంటూ ఏ ప్రపంచమూ లేదు. నీనా పాత్ర.. ప్రతి ఇంట్లోనూ గృహ కార్మికురాలిగా గుర్తింపు పొందిన గృహిణుల నిరాశ, నిస్పృహలకు అద్దం పడుతుంది. ‘మంచి’ భార్య, ఆదర్శ గృహిణిగా గుర్తింపు రాకపోయినప్పటికీ, ఆమె కష్టానికి తగిన చిన్న ప్రశంస కూడా దక్కదు. ఈ చిత్రం ప్రతీ మహిళ కుటుంబ జీవనాన్ని చక్కగా చూపించింది.
స్లీపింగ్ పార్ట్‌నర్..
‘జిందగీ ఇన్ షార్ట్’ ఆంథాలజీలో వచ్చిన మరో లఘుచిత్రం ‘స్లీపింగ్ పార్ట్‌నర్’. దివ్య దత్తా ప్రధాన పాత్ర పోషించగా, పునర్వసు నాయక్ దర్శకత్వం వహించాడు. ‘మారిటల్ రేప్’ సమస్య మీద వచ్చిన అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ ఇది. మనదేశంలో చాలా మంది ‘మారిటల్ రేప్’ బాధితులున్నా దారి గురించి పెదవి విప్పరు. ఇష్టం ఉన్నా లేకున్నా, భర్తను సంతృప్తి పరిచే బాధ్యత భార్యదే అన్నట్లుగానే మన సమాజం భావిస్తుంటుంది. ఈ సినిమాలో దివ్య దత్తాది కూడా అలాంటి పాత్రే కానీ, ఒకానొక సమయంలో సంప్రదాయాలను బ్రేక్ చేసి, ప్రతిరోజూ తనకు ఇష్టం లేకున్నా తనపై అత్యాచారం చేసిన తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. సున్నితమైన ఈ ఇష్యూను దర్శకుడు చాలా అద్భుతంగా, వాస్తవికంగా తెరకెక్కించాడు. డైలాగ్స్ కూడా మనల్ని కదిలిస్తాయి.
మహిళా సాధికారిత సాధించడంతో పాటు కట్టుబాట్లు, సంప్రదాయాలు, సమాజ ధోరణి అంటూ స్త్రీని అణిచివేస్తూ, ఆమె మాటను గొంతు దాటనివ్వని సున్నిత అంశాలపై కూడా మహిళలు ఇకనైనా ముందుకు వచ్చి తమకు జరిగే అన్యాయాలను ప్రశ్నించాలనేది ఈ చిత్రాల ప్రధాన ఉద్దేశ్యం.