అర్ధరాత్రి మద్యం తాగి పట్టుబడిన మహిళలు

by Sumithra |
అర్ధరాత్రి మద్యం తాగి పట్టుబడిన మహిళలు
X

దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్ 31న తాగి రోడ్లపై ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి పోలీసులు చెక్ పెట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు 931 కేసులు నమోదు చేశారు. వీటిల్లో ఎక్కవగా గచ్చిబౌలి ప్రాంతంలోనే కేసులు నమోదు అయ్యాయి. మద్యం తాగి పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 931 వాహనాలను సీజ్ చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఓ ఏడుగురికి 500 పాయింట్లు చూపించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారందరికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story