పరిగిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

by Sridhar Babu |   ( Updated:2021-12-09 23:15:22.0  )
parigi-mahila1
X

దిశ, పరిగి: జిల్లాలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కపూర్ శివారులో పరిగి- షాద్ నగర్ రోడ్ వద్ద మహేంద్ర షోరూం ముందు రోడ్డు పక్కన అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సై విట్టల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story