భర్త కానిస్టేబుల్‌పై.. తల్లిదండ్రులు అల్లుడిపై

by srinivas |
భర్త కానిస్టేబుల్‌పై.. తల్లిదండ్రులు అల్లుడిపై
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వివాహిత ఆత్మహత్యకు కానిస్టేబుల్ కారణమంటూ ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మృతురాలి తల్లిద్రండులు మాత్రం తమ బిడ్డ మృతికి అల్లుడే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావు పేటలో చోటుచేసుకుంది.

స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉంటున్న జానీ బేగం(28) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె ఆత్మహత్యకు అల్లుడే కారణమని మృతురాలి తల్లిదండ్రులు.. తన భార్య మృతికి రెండో పట్టణ పోలీస్ కానిస్టేబుల్ షేక్ సైదానే కారణమని మృతురాలి భర్త షేక్ ఖాజావలి ఫిర్యాదులు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story