- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
15 ఏళ్ల బాలుడిపై మహిళ లైంగిక వేధింపులు
దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళ చేసిన నిర్వాకం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. నాలుగు పదులు పైబడిన వయస్సులో ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆమె.. ప్రశాంతంగా జీవించడం మానేసి.. పైశాచిక ఆనందాన్ని ఎంచుకుంది. ఏకంగా 15 ఏండ్లు బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసింది. దీంతో ఆ బాలుడు ఇళ్లు వదిలి చుట్టాల ఇంట్లో మకాం వేశాడు. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. నోయిడాలోని డీఆర్ కాలనీలో ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటుంది. కాగా, ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. భర్త 10 ఏండ్ల కిందటే అకాల మరణం చెందాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యత మీద వేసుకొని ఎట్టకేలాకు ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించి అత్తారింటికి పంపింది.
తన కుతూళ్ల వివాహం ఆనంతరం డీఆర్ కాలనీలోనే ఒంటరిగా ఉంటుంది. ఈ సమయంలోనే తన కోరికలను తీర్చుకునేందుకు ఎదురింట్లో ఉన్న 15 ఏండ్ల బాలుడిని ఎంపిక చేసుకుంది. ఆ బాలుడికి ఏదో ఒక మాట చెప్పి ఇంటికి రప్పించుకునేది. తాను కూడా వారి ఇంటిలోకి వెళ్లి కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉండేది.
ఈ తరుణంలో ఓసారి ఇద్దరు కలిసిన సమయంలో నగ్న వీడియోలను చిత్రీకరించింది. ఆపై వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ అతడిని లోబరుచుకోవడం మొదలుపెట్టింది. రోజు బాలుడిని పిలుపించుకుని శారీరకంగా, లైంగికంగా హింసిస్తూ తన కోరికలను తీర్చుకునేది. ఆ మహిళ వేధింపులను తట్టుకోలేకపోయిన బాలుడు ఏకంగా ఇంటిలో నుంచే వెళ్లిపోయాడు. తమ బంధువుల ఇంట్లో మకాం వేశాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పిన రాను అంటూ మొండిపట్టు పట్టాడు.
దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీశారు. దీంతో బాలుడి ఎదురు ఇంట్లో ఉన్న ఆంటీ తనను లోబరుచుకుందని.. లైంగికంగా వేధిస్తోందని కుండ బద్దలు కొట్టాడు. ఈ మాట విన్న బాలుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. నిన్న మొన్నటి వరకు అక్కా చెల్లి అని పిలిచిన ఆవిడా తమ బిడ్డపై ఇంత దారుణానికి ఒడిగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత బాలుడిని తీసుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని విచారిస్తున్నారు.