ప్రియుడితో గ్రామ వాలంటీరు రాసలీలలు.. భర్తకు తెలియడంతో..

by srinivas |   ( Updated:2021-07-13 04:30:17.0  )
crime news
X

దిశ, ఏపీ బ్యూరో: భర్త ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పరాయి వ్యక్తి మోజులో పడిన భార్య.. భర్త, పిల్లలు కుటుంబం అవేమీ పట్టించుకోవడం మానేసింది. ప్రియుడే సర్వస్వం అన్నంతగా మారిపోయింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని కోరికలు తీర్చుకునేది. అయితే ఓ రోజు భర్త ఇంటికి వచ్చేసరికి తన భార్య ప్రియుడు మంచంపై ఏకాంతంగా ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. అయితే తన భర్తకు అక్రమ సంబంధం గురించి తెలిసిపోవడంతో ఆ భార్య ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే కోవూరు కొత్తూరు దళితవాడకు చెందిన సమతకు కలువాయి మండలం పెరమనకొండ గ్రామానికి చెందిన బండికాల రవీంద్రతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత కొత్తూరు దళితవాడలో కాపురం మార్చుకున్నారు. రవీంద్ర అల్లూరు మండలంలో ఓ చర్చికి పాస్టరుగా పని చేస్తున్నారు. సమత కోవూరు శాంతినగర్‌–2 ప్రాంతానికి గ్రామ వాలంటీరుగా పనిచేస్తోంది. ఈ నెల 6న అర్ధరాత్రి సమత తన ప్రియుడు ఉపర్తి రాముకు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా..అప్పుడే ఇంటికి వచ్చిన రవీంద్ర భార్య రాసలీలల భాగోతాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. భార్యను మందలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రియుడితో కలిసి సమత రవీంద్ర ముఖానికి దిండు అడ్డం పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం రవీంద్ర మృతదేహాన్ని రాము తన ఆటోలో తీసుకెళ్లి ఏసీసీ కల్యాణ మండపం సమీపంలో జాతీయ రహదారిపై పడేసి బొంతరాయితో ముఖంపై అతి కిరాతంగా కొట్టి రోడ్డుపై పడేశాడు.

స్థానికుల ఫిర్యాదుతో ఈనెల 7న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే తన భర్త ఒంటిపై గాయాలు ఉన్నాయని అతని మృతిపై అనుమానం ఉన్నట్లు ఏమీ ఎరుగనట్లు సమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోస్టుమార్టం నివేదికలో రవీంద్ర గాయాలతో మృతి చెందలేదని ఊపిరి ఆడకుండా చేయడం వల్ల మృతి చెందాడని నిర్ధారణ అయ్యింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు భార్య సమతను విచారించగా అసలు గుట్టు రట్టైంది. దీంతో సమత, రాములు సోమవారం తహసీల్దార్‌ సీహెచ్‌ సుబ్బయ్య ఎదుట లొంగిపోయినట్లు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచినట్లు వివరించారు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను చంపి ఆమె జైలు పాలైంది. ఒకవైపు తండ్రి మరణం..మరోవైపు తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.

Advertisement

Next Story