15 ఏండ్ల ’సంబంధానికి‘ పాతర

by Shamantha N |
15 ఏండ్ల ’సంబంధానికి‘ పాతర
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక‌లోని బళ్లారి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన ఆస్తిలో వాటా కావాలని అడిగినందుకు ప్రియురాలిని పాతిపెట్టాడు ప్రియుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గిరిగూండనహల్లికి చెందిన హులిగమ్మ తన భర్తకు విడాకులు ఇచ్చి పుట్టించికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన సిద్ధలింగప్పతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో సిద్దలింగప్ప ఆమె కుటుంబ పోషణ మొత్తం చూసుకునేవాడు. దాదాపు 15 ఏళ్లుగా హులిగమ్మకు అండగా ఉంటున్నాడు.

అయితే, తన ఆస్తిలో వాట కావాలని హులిగమ్మ సిద్ధలింగప్పతో తరచూ గొడవపడేది. ఎంత చెప్పినా వినకుండా ఆస్తి రాసివ్వాలని పట్టుబట్టి కూర్చుంది. దీంతో విసుగు చెందిన సిద్దలింగప్ప ఆమె హతమార్చాడు. చంపేసి తన పొలంలో పాతిపెట్టాడు. గత రెండ్రోజులుగా హులిగమ్మ కనిపించడం లేదని గ్రామంలో మారుమోగింది. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దలింగప్పతో వివాహేతరం సంబంధం ఉందని చెప్పడంతో పోలీసులు అతడిని విచారించారు. దీంతో ఆస్తి అడగడంతో ఆమె చంపేసి తన పొలంలోనే పాతర వేసినట్లు ఒప్పుకున్నాడు. సంఘటన స్ఠలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టు మార్టంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story