- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండగట్టులో మర్డర్ మిస్టరీ.. ఆమె ఎవరు.?
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు JNTU కళాశాలకు వెళ్లే దారిలో వేసిన కంటూరు కందకాలలో 22, 25 ఏళ్ల మధ్య వయసున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులకు మృతదేహం ఉన్న ప్రదేశంలో బండరాయికి రక్తపు ఆనవాళ్లు కనిపించడం, గొంతుకు సైతం గాయమై ఉండటం కనిపించింది.
యువతిని గుర్తు తెలియని వ్యక్తులు వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారా, లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఘటనా స్థలంలో క్లూస్ టీం సభ్యులు సైతం పలు ఆధారాలను సేకరించారు. దాదాపు రెండు ఏళ్ళు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి లేకపోవడంతో జిల్లా పోలీస్ యంత్రాంగానికి సవాలుగానే మారిందని నేర పరిశోధన విభాగం పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. మిస్టరీ హత్య కేసులను చేధించే క్రైం పోలీస్ డిపార్ట్‌మెంట్ విభాగం రెండు ఏళ్ళు గడుస్తున్నా యువతి హత్యకు సంబంధించిన చిక్కుముడిని చేధించకపోవడం వల్ల జిల్లా పోలీస్ క్రైమ్ రివ్యూలో.. ఈ హత్య కేసు ముచ్చెమటలు పట్టిస్తుందని కొందరు ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు.
జులై 7 , 2019 న..
(కొండగట్టు) ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని బొజ్జాపోతన్న ఆలయం సమీపంలో గుర్తు తెలియని యువతి మృతదేహం ఆదివారం లభ్యమైంది. అటుగా వెళ్లిన భక్తులకు కంటూరు కందకాల్లో యువతి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దాంతో మల్యాల సీఐ నాగేందర్ గౌడ్, కొడిమ్యాల ఎస్ఐ సతీష్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. యువతిని గుర్తు తెలియని వ్యక్తులు మెడకు ఉరివేసి చంపినట్లు ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఎర్ర చుక్కలు ఉన్న తెల్లరంగు కుర్తా, ఎర్ర రంగు పైజామా ధరించి ఉంది. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని, మృతురాలి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల ప్రజలను కలవరపరిచింది.
దాదాపు రెండేళ్లుగా..
దాదాపు రెండేళ్లుగా గుర్తు తెలియని యువతి ఎవరనేది ఆచూకీ లభించకపోవడం, పోలీసులకు ఈ కేసు చేధించడం సవాలుగానే మారిందని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పుకుంటున్నారు. మృతురాలి బంధువులను కనుగొనేందుకు యువతి మృతదేహం ఫోటోలతో పోస్టర్లు ముద్రించి విస్తృతంగా దర్యాప్తు చేసినప్పటికీ యువతి ఆనవాళ్లు బహిర్గతం కాలేదు. అంతే కాదు యువతి బంధువుల వివరాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ సరికొత్త టెక్నాలజీ విధానంలోను శోధించినా కుటుంబ సభ్యుల వివరాలు లభ్యం కాలేదు.
హతురాలు గర్భిణీ..?
కాగా, గుర్తు తెలియని యువతి వివాహితగా గుర్తించేందుకు ఆనవాళ్లు లేనప్పటికీ.. మూడు నెలల గర్భిణీ అని ఫోరెన్సిక్ పరిశోధన రిపోర్ట్‌లో తేలినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
వేగంగా దర్యాప్తు..
సీఐ నాగేందర్ గౌడ్ జిల్లాలో వలస కూలీలు నివసించే ఇటుక బట్టిలు, క్రషర్‌లో యువతి గురించి విచారణ జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో యువతుల మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడంతో దర్యాప్తులో అనిచ్చితి నెలకొందని అభిప్రాయ పడుతున్నారు. మృతురాలు పొరుగు రాష్ట్రాలకు చెందినట్లుగా అనుమానించిన సీఐ తన సొంత ఖర్చులతో యువతి డెడ్ బాడీ ఫోటో, పోలీసు ఉన్నతాధికారుల సెల్ నంబర్లతో పోస్టర్లును ముద్రించి రాష్ట్ర సరిహద్దుల్లో అంటించారని కొందరు పోలీసులు చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సీఐ బదిలీ కావడం, కేసు విషయంలో అంతగా ఒత్తిడి లేకపోవడం వల్ల విధుల్లో చేరిన కొత్త సీఐలు దర్యాప్తుపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో కేసు విచారణలో పురోగతి సాధించలేదని తెలుస్తోంది. హత్య వ్యూహాత్మకం అయినా, కాకున్న పోలీసుల దర్యాప్తులో హంతకుల నుంచి ఏదో ఒక ఆనవాలు లభించడం సహజం. కానీ, ఎక్కడో అటవీ ప్రాంతంలో జరిగే మిస్టరీ హత్య కేసులను చేధించే పోలీసులు.. ప్రజలు మధ్య దొరికిన ఈ హత్య కేసును ఇప్పటికీ చేధించకపోవడంతో స్థానికలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు పట్టుబడితేనే హత్య కేసులో వాస్తవాలు బయటకు వస్తాయనే చర్చ ఆ ప్రాంతంలో జరుగుతోంది.