- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలస్యం.. ఆమెను కోట్లు కొల్లగొట్టేలా చేసింది
దిశ, వెబ్‌డెస్క్: మన ఇండియన్స్ ట్రైన్స్ ఎప్పుడూ సమయానికి రావంటూ.. జోకులేసుకోవడం పరిపాటే. అయితే, విమానాలు కూడా డిలే అవుతూ ఉంటాయి. వాతావరణం బాగా లేకపోయినా, ఎదురుగాలులు విపరీతంగా వీస్తున్నా లేదా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లోనూ విమానాలు ఆలస్యంగా వస్తుంటాయి. ఈ విషయం ప్రయాణీకులకు ముందుగానే అనౌన్స్ చేస్తుంటారు కూడా. ఇదంతా తెలిసినా విషయమే కానీ.. కొన్ని దేశాల్లో విమానం ఆలస్యమైతే.. కంపెన్సేషన్(పరిహారం) ఇచ్చేలా ‘ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్’లు ఇస్తుంటాయి. ఎప్పుడైతే మనం టికెట్ బుక్ చేసుకుంటామో.. అప్పుడే ఈ ఇన్సూరెన్స్‌కు అప్లయ్ చేసుకోవాలి. అయితే ఈ ‘ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్’లో ఉన్న ఓ చిన్న లూప్ హోల్‌ను ఆధారంగా ఓ చైనా మహిళా కోట్లు కాజేయడం గమనార్హం.
డిజిటల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది ఎథికల్ హ్యాకింగ్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ల పని.. బగ్ (ఎర్రర్స్) కనిపెట్టడం. ఇదే పనిని ఇల్లీగల్‌గా చేసి కూడా కొందరు డబ్బు సంపాదిస్తారు. కానీ వాళ్లను సైబర్ క్రిమినల్స్ అంటారు. ఇక్కడ చైనాలోని నాన్‌జింగ్ ప్రాంతానికి చెందిన ‘లీ’ అనే మహిళ.. అందుకు రెండో దారిని ఎంచుకుంది. అంటే ఆమె హ్యాకరో, సైబర్ క్రిమినలో కాదు.. ఆమె కేవలం ‘ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్’లోని లోపాలను అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించింది. 2015లో ఆమె ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫ్లైట్‌లో వెళ్లింది. టికెట్ కొనేటప్పుడు ‘ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్’ కూడా తీసుకుంది. ఆ రోజు ఫ్లైట్ డిలే కావడంతో సదరు కంపెనీ ఆమెకు ఇన్సూరెన్స్ డబ్బులు అందించింది. ఇదేదో బాగుందనుకున్న ‘లీ’.. ‘ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్‌పై స్టడీ చేసింది. అప్పటివరకు తాను చేసిన విమాన ప్రయాణాల వివరాలు సేకరించింది. యూజర్ రివ్యూలను పరిశీలించింది. వెదర్ రిపోర్టులను చెక్ చేసింది. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో తెలుసుకుంది. ఇలా.. డేటా మొత్తం కలెక్ట్ చేసుకుని.. ఏయే విమానాలు లేట్‌గా వస్తుంటాయో పూర్తి సమాచారాన్ని సేకరించింది. ఆ డేటా ప్రకారం విమాన టికెట్లను బుక్ చేయడం మొదలు పెట్టింది. ఇలా 2015 నుంచి 2019 వరకు విమాన టికెట్లు బుక్ చేస్తూ.. ఫ్లైట్ డిలే కావడంతో ఇన్సూరెన్స్ మనీ క్లెయిమ్ చేసుకోవడమే పనిగా పెట్టుకుంది. అలా నాలుగేళ్లలో 4.23 డాలర్లు(దాదాపు రూ. 3.2కోట్లు) సంపాదించింది.
ఎవరికీ అనుమానం రావద్దనే ఉద్దేశంతో లీ.. తన పేరు మీదనే కాకుండా రిలేటివ్స్, ఫ్రెండ్స్ పేర్లతోనూ టికెట్లు బుక్ చేసేది. అలా మొత్తంగా ఆమెతో పాటు మరో 20 ఐడెంటీలతో ఇప్పటి వరకు 900 టికెట్లు బుక్ చేసింది. ఇటీవలే చైనాలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో ‘లీ’ మళ్లీ టికెట్ బుక్ చేసింది. ప్లైట్ డిలే కారణంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే.. ఆ రోజు ఫ్లైట్ డిలే కాకపోవడంతో లీపై అనుమానమొచ్చిన పోలీసులు ఆమెను పట్టుకుని విచారించగా.. బండారం బయటపడింది.