అక్రమ సంబంధంలో అనుమానం.. మహిళ బలి 

by srinivas |
అక్రమ సంబంధంలో అనుమానం.. మహిళ బలి 
X

అక్రమ సంబంధంలో అనుమానం మహిళ ప్రాణాలను తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తాడేపల్లి గూడేనికి చెందిన రామలక్ష్మి భర్తతో విడిపోయి ఉంగుటూరులో బిడ్డతో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కన నివసించే సూర్యారావుతో మూడేళ్ళ క్రితం అక్రమ సంబంధం ఏర్పడింది.

అయితే రామలక్ష్మి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందేమో అనే అనుమానం కలిగింది సూర్యారావుకి. అనుమానం ముదరడంతో ఆమెను చంపేయాలని భావించాడు. దీంతో ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను గొంతు నులిమి చంపేసి తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకి యత్నించాడు.

అటుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూర్యారావును ఆసుపత్రికి తరలించిన పోలీసులు రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story