దారుణం.. పని ముగించుకొని వెళ్తుండగా వెంటాడిన మృత్యువు..

by Sumithra |
accident
X

దిశ, కంది: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వివాహిత మృతి చెందిన ఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు‌కు చెందిన చిట్టమూరు దుర్గ (40) నాగేశ్వరరావు దంపతులు. వీరు సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని మొహమ్మద్ షాపూర్ తండ ఇటుకుల బట్టిలో పని చేస్తున్నారు. కాగా వీరు పని ముగించుకొని తిరిగి వస్తుండగా చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో దుర్గ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. నాగేశ్వరరావుకు గాయాలు అయ్యాయి. మృతురాలి కూతురు దివ్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed