- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీక్రెట్‌గా ఫొటోలు తీసిందని మహిళా జర్నలిస్ట్ అరెస్ట్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : అనుమతి లేకుండా ఫోటోలు తీసిందనే నెపంతో ఓ మహిళా జర్నలిస్టును బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వలసవాద కాలానికి చెందిన అధికారిక గోప్యతా చట్టం (1923) ఆమెపై మోపారు. బంగ్లాదేశ్ దేశంలోనే అతి పెద్ద పత్రిక అయిన ‘ప్రోతోమ్ అలో’ అనే వార్తా పత్రికలో మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాం పని చేస్తున్నారు. ఆమె సీనియర్ జర్నలిస్ట్.
ప్రభుత్వానికి చెందిన కొన్ని ఫైల్స్‌ను ఆమె అనుమతి లేకుండా రహస్యంగా ఫొటోలు తీశారని పోలీసులు అభియోగం మోపారు. అందువల్లనే అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్ట్ అనంతరం రోజినా ఇస్లాంను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. కాగా, మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాంను అరెస్టు చేయడంపై అక్కడి జర్నలిస్టు సంఘాలు, హక్కుల సంఘాలు మండిపడ్డాయి.
Advertisement
Next Story