అలిపిరి వద్ద మహిళ హల్‌చల్..యాత్రికులపై దాడి

by srinivas |   ( Updated:2021-09-11 04:29:37.0  )
అలిపిరి వద్ద మహిళ హల్‌చల్..యాత్రికులపై దాడి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి అలిపిరి లగేజ్ కౌంటర్‌ వద్ద గుర్తు తెలియని మహిళ హల్‌చల్ చేస్తుంది. దైవదర్శనానికి వస్తున్న యాత్రికులపై చెప్పులు విసురుతుంది. రాళ్లతో అందరిపై దాడికి పాల్పడుతోంది. దీంతో భక్తులు డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు లగేజ్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్టేషన్‌కు వెళ్లేందుకు మహిళ నిరాకరించింది. కొంతసేపు పోలీసులకు చుక్కలు చూపించింది. ఆ తర్వాత పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో పోలీసు వాహనం ఎక్కింది. దీంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed