- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లి.. ఫ్రెండ్ ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లిన యువతి
దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అనేది వధూవరులకు అదో మరుపురాని జ్ఞాపకం. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నప్పట్నుంచి ఇటు వధువు, అటు వరుడి ఇంట్లో నెల రోజులపాటు హడావుడి ఉంటది. తమ పెళ్లికి రావాలని వధూవరులు తమ స్నేహితులు, తెలిసినవాళ్లకు పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తుంటారు. తమ ఇంట్లో వాళ్లు కూడా వారికి తెలిసినవాళ్లకు, బంధువులకు పెళ్లి కార్డ్ ఇచ్చి ఆహ్వానిస్తుంటారు. అయితే, ఓ యువతి మాత్రం తన సోదరుడి పెళ్లి పత్రిక ఇవ్వడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి భారీగా బంగారు నగలు ఎత్తుకెళ్లింది. ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బనశంకరిలోని దేవరజీవనహళ్లికి చెందిన ఓ యువతి సోదరుడి పెళ్లి ఫిక్సయ్యింది. పెళ్లి పత్రికలు రెడీ చేసి వారికి తెలిసినవారికి ఇస్తున్నారు. పాదరాయనపురంలో ఉండే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, తన సోదరుడి పెళ్లికి రావాలంటూ పెళ్లి పత్రిక ఇచ్చింది. అనంతరం ఆ యువతి అర్జెంటుగా బట్టలు మార్చుకోవాలంటూ ఆ ఇంటిలో బీరువా ఉన్న రూంలోకి వెళ్లింది. బీరువాలో ఉన్న రూ. 11 లక్షల విలువ చేసే బంగారు నగలను చోరీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరునాడు ఆ యువతి ఫ్రెండ్ బీరువాను ఓపెన్ చేసి చూడగా అందులో నగలు కనపడలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువతిని ప్రశ్నించగా అసలు విషయం ఒప్పుకుంది. తన ఫ్రెండ్ ఇంట్లో తానే బంగారం ఎత్తుకెళ్లానని చెప్పింది. అనంతరం ఆమె నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.