పులివెందులలో మహిళ దారుణ హత్య 

by srinivas |
పులివెందులలో మహిళ దారుణ హత్య 
X

కడపజిల్లా పులివెందులలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పులివెందులలోని ఎస్బిఐ కాలనీ లో నివాసముంటున్న శివరాణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story