పాపం.. ఆమె ఇలా అయితదని ఊహించలేదు

by Sridhar Babu |
పాపం.. ఆమె ఇలా అయితదని ఊహించలేదు
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఓ మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట దగ్గరలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగాల్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొన్నది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఖమ్మంలోని ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన మహిళగా గుర్తించినట్లు తెలిసింది.

Advertisement

Next Story