జీజీహెచ్ ఆసుపత్రి గదిలో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2021-05-26 21:43:48.0  )
జీజీహెచ్ ఆసుపత్రి గదిలో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కాకినాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీజీహెచ్​ఆసుపత్రిలోని ఓ గదిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతి ఇటీవలే కొవిడ్ బారినపడ్డారు. అనంతరం ఆమె భర్త తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ సోకింది. దీంతో ఆయన జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో భర్తకు వ్యాధి నయం అవుతుందో లేదో అని.. ధైర్యం కోల్పోయిన బుల్లిమావతి ఈరోజు ఉదయం గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed