ప్లేట్ పాస్తా.. సెకన్లలో హాంఫట్ @రికార్డ్ బ్రేక్

by Shyam |
ప్లేట్ పాస్తా.. సెకన్లలో హాంఫట్ @రికార్డ్ బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్‌లో ‘పాస్తా’కు కూడా చోటుంటుంది. రెండు నిమిషాల్లో నూడుల్స్ చేసుకున్నట్లే, పాస్తాను కూడా అంతే త్వరగా చేసుకోవచ్చు. అయితే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసిన ఫుడ్‌ అయినా సరే.. ప్లేట్ పాస్తా తినడానికి మాత్రం కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. కానీ అంతకన్నా ఫాస్ట్‌గా తినేస్తే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ బద్దలు కొట్టొచ్చని తెలుసా? అమెరికాకు చెందిన ఓ మహిళ సెకన్లలో ప్లేట్ పాస్తా లాగించేసి వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

అమెరికాలోని అరిజోనాకు చెందిన మిచెలీ లెస్కో‌కు పాస్తా అంటే చాలా చాలా ఇష్టం. కొద్దిరోజుల క్రితం ఆమె 100 గ్రాముల పాస్తాను 26.9 సెకన్లలో తినేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. నాలుగేళ్ల క్రితం కెనడాకు చెందిన పీటె జెర్వింక్సీ 45 సెకన్లలో 100 గ్రాముల పాస్తాను తిన్న రికార్డ్‌ను మిచెలీ ప్రస్తుతం బ్రేక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా గిన్నిస్‌ బుక్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారిన పాస్తా ఫాస్టెస్ట్ ఈటింగ్‌ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. తాము కూడా సెకన్లలో ప్లేటు ఖాళీ చేసి గిన్నిస్ బుక్‌లో ఎక్కేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. చూడటానికి, చెప్పటానికి ఈజీగానే ఉన్నా.. గత రికార్డు బ్రేక్ కావడానికే నాలుగేళ్లు పట్టింది. మరి సవాల్ విసురుతున్న నెటిజన్లలో మిచెలీ రికార్డ్‌ను ఎంత త్వరగా బ్రేక్ చేస్తారో చూడాలి?

Advertisement

Next Story