అడవిలో తల్లీకుమారుడి హత్య

by Anukaran |
అడవిలో తల్లీకుమారుడి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టెల కోసమని తన ఏడాదిన్నర కుమారుడితో వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగుడు తల్లీ కుమారుడిని కర్కషంగా అంతమొందించి, అడవిలోనే పాతిపెట్టాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఉమ్నాపూర్ గ్రామానికి చెందిన సుజాత(30)కు భర్త మధ్య మనస్పర్థాలు రావడంతో ఏడాదిన్న కొడుకుతో సొంత గ్రామంలోనే ఉంటుంది. ఆమె గత కొంతకాలంగా చెవిటి రాము అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. మూడు రోజుల క్రితం కట్టెల కోసమని చందూరు మండలం ఘన్‌పూర్ గుట్టకు ఆమెను తీసుకెళ్లిన రాము.. కుమారుడితో సహా సుజాతను హత్య చేసి అక్కడే గుంతా తీసి పాతిపెట్టాడు.

మూడు రోజుల అనంతరం ఆదివారం చెవిటి రాము వర్ని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తానే ఇద్దరిని హత్య చేసి పాతిపెట్టినట్టు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అడవిలోకి వెళ్లి మృతదేహాలను వెలికి తీశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. తల్లీ, కుమారుడు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి.

Advertisement

Next Story