- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాదికి 200 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయగలం : వాక్‌హార్డ్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా టీకా కొరత ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థల్లో ఒకటైన వాక్‌హార్డ్ (Wockhardt) ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదన ఉంచింది. ఏడాదికి 200 కోట్ల టీకా డోసులను తయారుచేసే సామర్థ్యం తమ కంపెనీకి ఉందని వెల్లడించింది. 2022 ఫిబ్రవరి నుంచి 50 కోట్ల టీకా డొసుల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఏ కంపెనీ టీకాలను ఉత్పత్తి చేయాలో గుర్తించిన తర్వాత సదరు కంపెనీతో భాగస్వామ్యం కోసం ప్రభుత్వ సహకారం అవసరమని వాక్‌హార్డ్ వివరించింది. ఇప్పటికే కొవిడ్ టీకా ఉత్పత్తిని నిర్వహించేందుకు కావాల్సిన టెక్నాలజీ కంపెనీ వద్ద ఉందని, ప్రోటీన్ ఆధారిత, ఎంఆర్ఎన్, వైరల్ వెక్టార్ వంటి వివిధ టెక్నాలజీల ఆధారంగా తయారుచేసే టీకాను ఉత్పత్తి చేయగలమని, అంతేకాకుండా దానికి తగిన పరిశోధనలు కూడా చేపట్టేందుకు గల సామర్థ్యం తమకు ఉందని కేంద్రానికి సమాచారమిచ్చినట్టు పేర్కొంది. వాక్‌హార్డ్ సంస్థ ప్రస్తుతం యూకే కోసం కరోనా టీకా తయారు చేయడానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ టీకా వయల్స్ నింపి, ప్యాకింగ్ చేస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది.