Sonakshi Sinha: ఈ సంవత్సరం ఊహించని సర్‌ప్రైజులు ఇచ్చింది.. సోనాక్షి సిన్హా ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
Sonakshi Sinha: ఈ సంవత్సరం ఊహించని సర్‌ప్రైజులు ఇచ్చింది.. సోనాక్షి సిన్హా ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ‘కాకూడ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఇంకొన్ని రోజుల్లో 2024కు గుడ్‌బై చెప్పబోతున్నామంటే కాస్త బాధగా ఉంది. ఎందుకంటే.. నా జీవితాన్ని ఆనందమయం చేసిన సంవత్సరం ఇది.

నేను ఊహించని రెండు సర్‌ప్రైజులు(Surprises) ఈ ఏడాది నాకిచ్చింది. పెళ్లితో జీవితంలోని ముఖ్యమైన ఘట్టాన్ని మొదలుపెట్టాను. అలాగే భన్సాలీ(Bhansali) డైరెక్షన్‌లో నటించే అరుదైన అవకాశం ‘హీరామండీ’(Heeramandi ) తో లభించింది. అది కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు ‘కాకుడా’(Kakuda) చిత్రంతో సోనాక్షి ఎలాంటి పాత్ర అయినా చేయగలదు అని నిరూపణ అయింది. అందుకే అటు వృత్తిపరంగా.. ఇటు వ్యక్తిగతంగా ఈ ఏడాది నాకు స్పెషల్‌(Special). ఈ సంతోషంతోనే 2025లోకి అడుగుపెడుతున్నాను. వచ్చే ఏడాది నటిగా కొత్త సోనాక్షిని చూస్తారు’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed