- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు
దిశ, మహబూబ్ నగర్: డాక్టర్ రాసిచ్చిన మందుల చీటి లేకుండా ఎవరికీ మందులు అమ్మరాదని మెడికల్ షాపు యజమానులకు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం ఉదయం తేరు మైదానం వద్ద గల మెడికల్ షాపును ఆర్డీవో వీ రాములుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో మందుల కోసం వచ్చిన వారి వద్ద ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకపోవడంతో కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు నోట్ చేసుకోకుండా మందులు అమ్మడాన్ని గమనించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట మందుల కోసం వచ్చే వారి వద్ద డాక్టరు రాసిచ్చిన చీటి ఉంటేనే మందులు ఇవ్వాలని, లేనివారి వివరాలు, మొబైల్ నంబర్లు తప్పకుండా రికార్డు చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని శ్రీ హర్ష హెచ్చరించారు.
Tags: without prescription, caution against medical shops, orders by assistant collector sri harsha