- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ నిర్వహించకున్నా ఫీజు వసూలు
దిశ, హైదరాబాద్: ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపి కట్టెది మరో దారి అన్నట్టు.. ప్రపంచం అంతటా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ బందీలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఏప్రిల్ నెలంతా పాఠశాలలు పనిచేయకున్నా.. విద్యార్థులకు తరగతులు నిర్వహించకున్నా యాజమాన్యాలు ఫీజులను వసూలు చేస్తున్నాయి. పాఠశాలల యాజమాన్యాలు వార్షిక ఫీజులను కాకుండా, కేవలం నెలవారీ ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. అయినా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏప్రిల్ నెల ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.
సికింద్రాబాద్‌లోని సెయింట్ లూయిస్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన సెయింట్ ఆండ్రివ్స్ స్కూల్ యాజమాన్యం రెండో తరగతికి ఏప్రిల్ కోసం రూ.7 వేల ఫీజు వసూలు చేస్తోంది. తరగతులే నిర్వహించని ఏప్రిల్ నెలకు పాఠశాలలు ఫీజులెలా వసూలు చేస్తారని, ఈ విషయంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకుడు వెంకట్ సాయినాథ్ డిమాండ్ చేశారు.
Tags: Corona Effect, School Fees, Lockdown, Forcible Fees Connection, HS PA