24 గంటల్లో 1,211 కేసులు.. 31 మరణాలు : కేంద్రం

by vinod kumar |
24 గంటల్లో 1,211 కేసులు.. 31 మరణాలు : కేంద్రం
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1,211 కరోనా కేసులు నమోదవ్వగా.. 31 మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. 1,189 మంది రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.31 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇందులో 18,664 టెస్టులను ఐసీఎంఆర్ ల్యాబ్‌లలో, 2,991 టెస్టులు ప్రైవేట్ ల్యాబ్‌లలో నిర్వహించినట్టు పేర్కొంది. ఇది వరకే ఆర్డర్ చేసిన 33 లక్షల ఆర్‌టీపీసీఆర్, 37 లక్షల ర్యాపిడ్ కిట్లు ఏ క్షణంలోనైనా ఇండియాకు చేరొచ్చని వెల్లడించింది. కాగా, నిన్న సాయంత్రానికి దేశంలో మొత్తం కేసుల సంక్య 10,815కే చేరాయి. 353 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే, రికవరీల సంఖ్య కూడా 1,190తో ఆశాజనకంగానే ఉన్నది. అత్యధిక కేసులు మహరాష్ట్రలో(2,337) నమోదయ్యాయి. మరణాల సంఖ్య ఈ రాష్ట్రంలో అధికంగా(160) ఉన్నది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (1,510), తమిళనాడు(1,173)లున్నాయి.

Tags: coronavirus, cases, deaths, fatalities, india, across, health ministry

Advertisement

Next Story