మందు బాబులకు బిగ్ షాక్.. రెండ్రోజులు వైన్స్ బంద్​

by Anukaran |   ( Updated:2021-09-18 04:26:14.0  )
Wines
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు రెండు రోజులు తాళాలు పడనున్నాయి. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే జిల్లాల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, లిక్కర్​‌స్టోర్‌లు, పబ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఆర్డర్లు జారీ చేశారు. శనివారం రాత్రి 11 గంటల వరకు వైన్​షాపులు తెరిచి ఉంటాయని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

వరుడి కట్నం తీసుకుని ప్రియుడితో పరారైన వధువు.. ట్విస్ట్ ఏంటంటే..?

తీవ్ర విషాదం: ఐదు మృతదేహాల మధ్య మూడేళ్ల చిన్నారి.. ఐదురోజుల నుంచి ఆకలితో

Advertisement

Next Story