- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు రేవంత్ బాహుబలి కానున్నాడా?
దిశ, వెబ్‌డెస్క్: ‘తెలంగాణ కాంగ్రెస్‌కు అసలు సిసలు బాహుబలి వచ్చారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ ఇచ్చి కొత్త ఊపిరి అందించే సరైన నాయకుడు వచ్చారు. భూస్థాపితం అవ్వబోతున్న కాంగ్రెస్‌కు ఇక మంచి రోజులు రానున్నాయి. ఐసీయూలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ను బ్రతికించగలిగే నాయకుడు రానే వచ్చారు. కాంగ్రెస్ ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌కు ఇక ముచ్చెమటలే’ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రస్తుతం ప్రజానీకంలో, కాంగ్రెస్ శ్రేణుల్లో, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే.
‘సింహం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇస్తూ కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసకుంది. ఇక ఇప్పుడు పులులన్నీ సింహం రేవంత్‌కు భయపడాల్సిందే’ అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చిన తర్వాత తనకు కాంగ్రెస్‌పై ఇష్టం కలుగుతోందని, సోనియా, రాహుల్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు.
ఒక్క ఆర్జీవీనే కాదు.. తెలంగాణలో చాలామంది అభిప్రాయం ప్రస్తుతం ఇలాగే ఉంది. తెలంగాణలో ఫైర్‌బ్రాండ్, కేసీఆర్‌ను ఢీకొట్టే నాయకుడు ఎవరంటే.. అందరకీ టక్కున గుర్తొచ్చే పేరు రేవంత్ రెడ్డి. మాస్ ఇమేజ్‌తో పాటు యూత్‌లో రేవంత్‌కు మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా రేవంత్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరినా.. ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆయనను అభిమానిస్తున్నారంటే.. ఇతర పార్టీల్లో కూడా రేవంత్‌కు ఫాలోయింగ్ ఉన్నట్లు అర్థమవుతోంది.
అలాంటి ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో.. ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాల్లో ముగినిపోయారు. కాంగ్రెస్‌కు బాహుబలి వచ్చాడు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. అటు యూత్ లీడర్, మాస్ ఇమేజ్, మంచి వాగ్ధాటి, ప్రజా సమస్యలపై అవగాహన, పొలిటికల్‌గా సబ్జెట్ ఉన్న రేవంత్‌కు పగ్గాలు అప్పగించడం ఆ పార్టీకి ప్లస్‌గా మారనుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే రేవంత్ ముందు ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. అస్తవ్యస్థంగా తయారైన కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలందరినీ కలుపుకుని రేవంత్ ఎలా మందుకెళ్తారు?. కాంగ్రెస్ బలహీనపడటంతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను మళ్లీ ఎలా తీసుకోస్తారు?..టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిన క్రమంలో కాంగ్రెస్‌ను కేసీఆర్‌కు బలమైన ప్రత్యర్థిగా ఎలా మారుస్తారు? అనేవి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. మరి వీటన్నింటిని పరిష్కరించి బలహీనపడిన కాంగ్రెస్‌కు రేవంత్ కొత్త రక్తం అందిస్తారా?.. లేదా? అనేది వేచి చూడాలి.