- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి రెడ్‌హ్యాండెడ్ పట్టుకున్న ఎమ్మార్వో.. అలా చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరిలిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తానని పినపాక ఎమ్మార్వో విక్రమ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో దిశ విలేకరితో మాట్లాడుతూ… మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుకున్న రెండు ట్రాక్టర్ల యజమానులకు జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. మండలంలో ఎంతటి వారైనా సరే అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ ఎమ్మార్వో తెలిపారు.
ఇదిలా ఉంటే.. అక్రమంగా ఇసుక తరలిస్తున్నవారిపై ఎమ్మార్వో పంజా విసురుతున్నారని మండల ప్రజలు అంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అక్కడికి వెళ్లి పట్టుకున్నారంటూ ఎమ్మార్వో విక్రమ్ కుమార్ ను అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపై ఎమ్మార్వో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి శక్తివంతంగా పనిచేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.
- Tags
- illegal sand