భారత్‌కు బౌలింగ్ కోచ్‌గా రెఢీ : అక్తర్

by Shyam |
భారత్‌కు బౌలింగ్ కోచ్‌గా రెఢీ : అక్తర్
X

పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ తన మనసులోని మాట బయటపెట్టాడు. టీం ఇండియా బౌలింగ్ కోచ్‌గా పని చేసేందుకు సిద్ధమేనని ప్రకటించాడు. ‘భారత్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేసే అవకాశమిస్తే.. నాకున్న అనుభవంతో భారత్‌లో మరింత మంది నాణ్యమైన పేసర్లను తయారు చేస్తానని’ అన్నాడు. టీం ఇండియాకే కాదు.. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కూడా కోచ్‌గా పని చేసేందుకు సిద్ధమేనన్నాడు. తాను కోచింగ్ ఇస్తే మరింత వేగంగా బంతులు విసిరే, దూకుడుగా ఆడే పేసర్లను తయారు చేస్తానని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’గా పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్‌కు మొదటి నుంచి భారత జట్టంటే ఒకరకమైన అభిమానం. అతడికి భారత్‌లో క్రికెటర్లు యువరాజ్, హర్భజన్ మంచి మిత్రులన్న విషయం తెలిసిందే.

Tags: Shoaib Akhtar, Team India, Bowling Coach, Coach, Kolkata Knight Riders

Advertisement

Next Story